"ఐ కెన్ మోర్ డిసర్వింగ్ దెన్ యూ" అని చెప్పిన ఇనయా!
on Oct 6, 2022
రోజు కొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాను ప్రేక్షకులకు కలుగజేస్తుంది "బిగ్ బాస్ సీజన్ 6". దీనికి కారణం ఇనయా, శ్రీహాన్ ల మధ్య పెరుగుతున్న 'Ego' తో కూడిన గొడవలు. హౌస్ లో రోజు రోజుకి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. కాగా నిన్న మొన్నటి దాకా మనస్పర్ధలతో దూరంగా ఉన్న చంటి, గీతు ఇద్దరూ కూడా నామినేషన్లో కలిసిపోయినట్టుగా కనిపించారు. అయితే ఎవరు కలిసినా కలవకపోయినా, మేం కలవటం జరుగదు. మేం ఇంతే ఇలానే ఉంటాం అని శ్రీహాన్, ఇనయా మరోసారి నిజం చేస్తూ మరోసారి కంటెంట్ గా మారారు.
నామినేషన్లో భాగంగా శ్రీహాన్, ఇనయాతో "మీ ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో? ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటారో? చెప్పండి " అని బిగ్ బాస్ కోరాడు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం మొదలు పెట్టారు. "నేను టాస్క్ లో , గేమ్స్ లో, పనులలో అన్నింట్లో 100% ఇస్తున్నాను. నేను ఎలిమినేట్ అవ్వాలనుకోవట్లేదు" అని ఇనయా చెప్పగా, "నువ్వు పనులు చేస్తున్నావ్. గేమ్ ఆడుతున్నావ్. ఎంటర్టైన్మెంట్ ఏం అయినా చేస్తున్నావా?" అని శ్రీహాన్ అనగా, దీనికి సమాధానంగా ఇనయా మాట్లాడుతూ "ఇది బిగ్ బాస్ షో, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు టాస్క్ లు, ఆటలు, మాటలు అన్ని కలుపుకొని పాయింట్లు కలుస్తాయి" అని చెప్పింది. ఇలా అనగానే శ్రీహాన్ " ఇది బిగ్ బాస్ సీజన్ 6, ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్" అంటూ గట్టిగా అరిచేసాడు. కాసేపు ఆలోచించిన ఇనయా, 'ఆ ఇప్పుడేంటి నువ్వు నామినేట్ అవుతావా అవ్వవా అని' అడుగుగా 'నేను అవ్వను' అని శ్రీహాన్ చెప్పాడు. "సరే పో..నేను నామినేట్ అవుతున్నాను. కానీ ఈ వారం నేను నీకన్నా బాగా పర్ఫామ్ చేస్తాను. ఇక్కడ ఉంటాను. టైటిల్ కొట్టుకునే వెళ్తాను. ఐ కెన్ మోర్ డిసర్వింగ్ దెన్ యూ " అని ఇనయా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది. చివరగా ఇనయా నామినేట్ అవ్వడంతో ఈ గొడవ ఆగింది.
అయితే లాస్ట్ వీక్ కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ "ఎప్పటి గొడవ అప్పుడే మాట్లాడి పరిష్కారించుకోవాలి" అని చెప్పాడు. మరి ఆ విషయాన్ని మర్చిపోయి వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు ఎలా స్పందిస్తాడో మరి. ఇద్దరి మధ్య పెరిగిన దూరానికి గాను నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకునేలా ఉన్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే చూడాలి మరి ఇనయా, శ్రీహాన్ ల మధ్య గొడవ ఇంకా ఎంత దూరం కొనసాగుతుందో!
Also Read